Tuesday, 16 October 2012

ప్రకృతి నా నేస్తం

ప్రకృతి నా నేస్తం తెల్లవారుతుండగానే ఉదయభానుడు తన లేలేత కిరణాలతో లేవగొట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు. చిన్నగా లేచి, పిల్ల కాలువలో నిలబడితే చల్లని నీరు నా పాదాలు తాకుతూ జలజలా అంటూ లయబద్దంగా పలకించింది పనికని పొలం దగ్గరికెళ్తే పిల్లగాలి, ఎలా ఉన్నావంటూ నా మేను నిమిరుతూ సాగిపోయింది... నా అరి కాళ్లతో భూమిని పలకరించితే గడ్డిపూలు కదుపుతూ భూమాత హాయ్ అని చెప్పింది. ఎండకి తాలలేక చెట్టుకిందకెళ్తే చెట్టు తన కొమ్మలను వింధ్యామరలు చేసి వీచింది దానిపై పక్షులు కిలకిలా అంటూ నాతో మాటలు కలిపి అలసట తీర్చాయి.. సాయంత్రం సముద్రతీరం చేరితే అలలతో హొయలుపోతూ హౌ ఆర్ యూ అంది.... అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే.. భానుడిని డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ) కొలిమిలా కాలిన నేలను చల్లార్చడానికి వర్షపు చినుకులు చిటపడ రాలుతూ నాకు చెక్కిలిగిలి పెట్టాయి... చూసే మనసుండాలే కానీ ప్రకృతి లో ఎక్కడ చూసినా " స్నేహ భావమే" తొనికిసలాడుతుంది........... కాదంటారా ?

No comments: