Tuesday, 16 October 2012
అది నాకు సాధ్యమేనా ?
గుప్పెడంత గుండెను,
దొసెడంత మనసును,
చెరగని చిరునవ్వులను,
వెచ్చని ఆశ్లేషములను ఇవ్వాలని ఉంది
తరగని ప్రేమను,
అంతులేని ఆనందాలను,
మరపురాని మమతలను,
అపురూపమైన అనురాగాలను కుమ్మరించాలని ఉంది.
స్వార్ధపు సామ్రాజ్యములను,
విషపు చూపుల శరాలను,
మాటలు చేసిన గాయాలను,
బాధలు చేసిన తీరువులను సమూలంగా తుడిచేయ్యాలని ఉంది.
సంకుచిత భావనలను,
విషాదపు రోదనలను,
ఒంటరితనపు భావాలను,
మదిలో నిండిన మౌనాన్ని దూదిపింజల్లా ఎగరగొట్టాలని ఉంది.
అరమరికలు లేని నవ్వులకోసం.
బుల్లి బుల్లి సంతోషాల కోసం,
సరికొత్తకలలను మోసుకొచ్చే అలల కోసం,
వెలుగు చూడని పాషణ రాత్రులను పారద్రోలే కాంతి కిరణాల కోసం ఎదురుచూడాలని ఉంది
మతం అనే తుపాకీ చేసే మారణహోమాలు లేని,
కులం మత్తెక్కిన కీచకులుండని,
మోసపు మనుగడలు మచ్చుకైనా ఉండని,
విజ్ఞానపు వెలుగులు వెదజల్లే,
మానవత్వంతో మెసలే మనుషులు ఉండే సరికొత్త సమాజం నిర్మించాలని ఉంది.
ఇవ్వన్నీ సాధ్యమేనా ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment