Tuesday, 16 October 2012

నా ఆశలకు రూపానివి నువ్వు

చెలి....... నా ఊహలకు ఊపిరి నువ్వు నా ఊసులకు ఉనికివి నువ్వు నా ఆశలకు రూపానివి నువ్వు నా కనులకు వెలుగువు నువ్వు నా కలలకు రంగువు నువ్వు నా చిరునవ్వుకు గమ్యం నువ్వు నా మది పలికే రాగానివి నువ్వు నా యదలో ఆశలు రేపే చిరుజల్లువు నువ్వు నా ఆలోచనలకు భావానివి నువ్వు నా కడదాకా నడిచే బంధానివి నువ్వు నిన్ను చూసిన క్షణం నా గుండె కాంతి వేగానికి సమానమైంది నిన్ను తలచిన మరుక్షణం నా మనసు కేరింతలుకొట్టే పాపాయిలా మారింది నా కనులు అనుక్షణం నిన్నే చూడాలని తపిస్తున్నాయి.... నే పీల్చే శ్వాస నిరంతరం నిన్నే గుర్తుచేస్తోంది. ప్రతిక్షణం నా పాదాలు నీతోనే నడవాలనుకుంటున్నాయి నీపై ఉన్న నా ప్రేమని ప్రకటిద్దామంటే గొంతు మూగబోయింది ఆ ప్రేమ మదిలోనే ఆవిరిలా ఇంకిపోయింది నిన్ను చూడనివేళ మనసు ఉప్పొంగిన సముద్రమైంది నువ్వు దూరమైన వేళ నా హృదయం చలనం లేని రాయిగా మారింది.... నా చెలి నన్ను విడిచి వెళ్ళకు.... చెరగని చిరునవ్వు గల నీ పెదాలతో అడిగితే నా ప్రాణమైనా ఇవ్వడానికి నే సిద్దంగా ఉన్నాను....

No comments: