Saturday, 13 October 2012

ఓ సాయంత్రం ....

"నువ్వు ప్రేమని విరాళం లా పంచేస్తున్నావ్ అది నాకు నచ్చదు" అన్నాడు అతను " హహ అదేంటీ అలా అన్నావ్ ?" నవ్వుతూనే అడిగింది " ఏమోనబ్బా ! నాకు పోసేసివ్నేస్స్ ఎక్కువ , నేనలా అందరితో ఒకేలా ఉండలేను , ప్రేమగా " " పోసేసివనేస్ , హహ బాగుంది అది ఉంటుంది , ఉండాలి మంచిదే , అసలొక పెద్దాయన అన్నారు అదే లేక పొతే ఏమీ చెయ్యలేమని తెలుసా" " అదేంటి ఉండాలంటావు మరి ప్రేమిస్తున్నానంటావు, నావారు నా సొంతం అనిపించదా ఎవరి పట్లా?" " ఎందుకనిపించదు , అందరు నావాళ్ళే కదా అనిపిస్తుంది .." నిశ్చలత ఆమె గొంతులో " ఏమో నాకు నువ్వు అర్ధం కావట్లేదు పిల్లా" " అర్ధం కాక పోయేంత గొప్ప వ్యక్తినేమీ కాదులే గానీ....అయినా పోనీ అర్ధం చేసుకోకు , కొన్ని అర్ధం కాకుండా ఉండటమే మంచిది ఆరోగ్యానికి " పకపక నవ్వింది " అంతేలే ! నువ్వనుకున్నదే నీకు వేదం ..." " ఎవరికైనా అంతే సారూ! తాను వలచిందే రంభా, తాను మునిగిందే గంగ , వినలేదూ ఈ సామెత ?" " ఏమో అందరికి పంచేస్తే అది ప్రేమెందుకు అయ్యింది , ఇక ప్రత్యేకత ఏముంది , అయిన మన ప్రేమ పొందే అర్హత అవతలి వ్యక్తి కి ఉండద్దూ?" " అయ్యో ప్రేమించడానికి అర్హతేంటి సార్ , అది పెద్ద మాట , ఎవర్నైనా ప్రేమించ గలగాలి , ఎవరిని వారుగా ప్రేమించాలి " " ఏమో నీ ప్రేమ గోల నాకు అర్ధం కాదు " " అంతే కదా నన్ను ప్రేమించడానికి నీకు నా ప్రేమ గోల , నిన్ను ప్రేమించడానికి నాకు నీ ప్రేమ లేని గోల అడ్డంకులు కావుగా అందుకని " " అందుకని ..." రెట్టించాడు " అసలా మాటలే వదిలేద్దాం" " మొండి ఘటం ..." విసుక్కున్నాడు ముద్దుగా " మరేమీ చెయ్యను చెప్పు .... నెక్స్ట్ జన్మ బెటర్ లక్..నీకు హహ" నవ్వింది " వద్దు తల్లీ ! ఈ జన్మకిది చాలు వచ్చే జన్మలో కూడా నువ్వేనా నా బుర్ర తింటావు వద్దులే , మంచి అమ్మాయ్ దొరకాలని అదిగో పద గుడికి పోయి దణ్ణం పెట్టుకుందాం" " నే రాను ! ప్రేమే దైవం నాకు ఇక గుడిలో కి ఎందుకు , ఆ రాతి బొమ్మలో కాదు మనిషిలోని మమతను చూడాలి అన్నదే నా నమ్మకం " " నీ నమ్మకము నువ్వు ఇక్కడ ఉండండి నే వెళ్లి వస్తా " కదిలాడు " ఆగాగు అబ్బాయ్ గుడి లోకి రానన్నాను కానీ నీతో గుడి దాక రానని అనలేదు గా అంత ఆలకైతే ఎలా?" " అంతే గుడి వద్దు కానీ ప్రసాదం తింటావా " వెక్కిరించాడు " భేషుగ్గా తింటాను దానికేం ..అసలే ఇక్కడ ఈరోజు చక్కెర పొంగలి ఇస్తారు కూడానూ బహు బాగుంటుంది చలో " పకపకా నవ్వుతూ నడుస్తున్న అతని వెనుక అడుగులో అడుగు వేస్తూ ....ఆమె ....

No comments: