Saturday, 13 October 2012

నేను

నిశ్శబ్ద మాధుర్యాన్ని నీ కేమీ కాను నేను నిను గన్న అమ్మను కాను జీవితం పంచుకున్న అర్ధాంగిని కాను నీ తోడ బుట్టలేదు నేను నీ తోడి ఆడిపాడలేదు నేను ఫలించిన నీ రేతస్సును కాను గర్వించే నీ యశస్సు నూ కాను అయినా.............. ఏమీ కాని , నేనే నీకు "అన్నీ" అది నాకు తెలుసు అందుకే చెప్తున్నా నేను నిన్నావరించిన "నిశ్శబ్ద మాధుర్యాన్ని" నీ చుట్టూ.... నీతోనే ఉంటూ... నీలోనే ఉంటూ..... నా అస్తిత్వాన్ని పండించుకుంటాను

No comments: