Monday, 15 October 2012

వర్ణలేఖ || ఓ స్త్రీ సంఘర్షణ ||

బాధనీ భయాన్నీ బాహువుల్లో బంధించి నాలో నేను కుచించుకుపోతున్నా కన్నుల్లో కరుణలేదు కన్నీరు తప్ప నీవెలాగూ ఓదార్చవని తెలిసి, పొంగుకొస్తున్న దుఃఖాన్ని జోకొడుతున్నా నేనెప్పటికైనా మేల్కొందామని *** *** *** *** నేనో కాలనాగై ఎదిగానని తెలియని నీవు ఉప్పెనలా నిన్ను ముంచేస్తే ఎలా విల విలలాడుతావోనని జాలి పడుతుంది నా పిచ్చి హృదయం నిద్ర నటిస్తున్న నేను కమ్మటి కలలేకాదు నీ కర్కషపు మనసును కంటున్నా నన్ను నీవింకా పసితనపు దుప్పట్లోనే జోకొడుతున్నవు. ప్చ్.... *** *** *** *** ఏదారీ లేదని గోదారి వెతుక్కునే రోజులు పోయాయి మందిలో ఉంటూ ఒంటరితనం భరించడం అనవసరం బానిస బతుకుకి బందాల పేరు పెట్టి మీరాడే నాటకానికి కాలం చెల్లబోతోంది మరణమే గతి అనిపించినరోజు ఈ శృంఖలాలను తెంచుకొని వీర మరణం పొందుతా కనీసం చావులోనైనా నాకు ప్రశాంతత లభిస్తుందనే ఆశతో

No comments: