Monday, 15 October 2012

మనసుతో అమీ తుమీ...!!

కలల ఆశ చూపి కళ్ళల్లో నిద్దురను నింపి, వెలుగు ఆశ చూపి రెప్పల్లోకి రేపటిని ఒంపి ఆటలాడే ఓ మనసా... నీకు అలుపు లేదని నీకైనా తెలుసా? నీకు ఆశ చూపడమెలాగో నీలో కలత రేపడమెలాగో వయసు తేడా లేకుండా స్థాయి తారతమ్యాలు చూపకుండా అందరినీ పట్టి ఆడిస్తావు అలుపురాకముందే ఓడిస్తావు.. అనుకున్నది చేస్తావు అనుకోనిది చేయిస్తావు... నీతో వేగడం మా చెడ్డ కష్టం సుమీ....!! త్వరలోనే తేల్చుకుంటా నీతో అమీతుమీ...

No comments: