Saturday, 13 October 2012

పదిలమే నీ స్నేహం..

తెలియని భావన కనులలో కన్నీరా లేక పెదవిపై చిరునవ్వును పలికించాలా అన్నది నాలో తెలియని భావన ... చెరిగిపోయిన దూరం సంతోషపెట్టినా చెదరని ఈ మౌనం నన్ను వేధిస్తోంది... వెన్నల పర్వంలోని హాయి గుర్తొచ్చినా దానికి నిదుర నన్ను దూరం చేస్తుందేమో అన్న కలవరం నన్ను తొలచి వేస్తోంది... మెత్తని ముసుగుల వెనుక ముళ్ళ కానుకగా ఈ సమయం వీడని రహస్యంలా వేధించే ఈ అల్లరి గాయం... ఈ దూరం వీడుతుందని తెలిసిన ప్రస్తుతానికి ఓ సంశయం ఆగని గుండెలో ఎప్పటికి పదిలమే నీ స్నేహం...

No comments: