Saturday, 13 October 2012
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిసాయి
కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
ఆ….. కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
సన్న సన్నగ వలపు సంగతులు వేసాయి
మోహనా ఆలాపించ మోహమే ఆపింది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
శృతి కలిపి జత కలిసి సొక్కులెరిగిన వాడు తోడైన నాడే నే తోడు పాడేది
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది
ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది
ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
వేచి ఉన్నది వీణ కాచుకున్నది కాన …
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment