Saturday, 13 October 2012

ఏమిటో ఈ వింత ప్రేమగోల,

ఏమిటో ఈ వింత ప్రేమగోల, నాకే అవుతుంది ఎందుకిలా, మనస్సులో తన ఊసులే......వెతికి చూస్తే, కనులలో తన నవ్వులే.....తెరిచి చూస్తే, ఇంతలా మాయచేసింది తనే అనటంలో ఏ సందేహమూ లేదు, కొద్ది కొద్దిగా తను నా మదిని దోచగా మిగిలింది కేవలం నా పార్దీవ దేహం, నిన్ను కలిసాకే తెలిసింది...మాటలతో మత్తు చల్లి మాయచేయచ్చంటూ, నిన్ను చూసాకే తెలిసింది....మనిషినుంచి మనసుని దూరం చేయచ్చంటూ, నీ సోయగం చూసి అప్పుడు అనుకున్నా ...నువ్వు పెద్ద అందగత్తెవని, నా మనసు దాచాకే తెలిసింది ...నువ్వు పెద్ద మంత్రగత్తెవని, అడగాలని ఉన్నా....నిను చూడగానే నా మాటే మౌనం అయిపోతుంది, ఇంత చేస్తున్నా....నువ్వు లేకపోతే నాచుట్టూ సోన్యం అయిపోతుంది, ఎవరికి చెప్పుకోను ఈ వింతగోల,నా మనసే నన్ను వదిలి వెల్లిపోతే, నీకే తెలుస్తుంది ఈ ప్రేమలోని మాయ ....నాలాగే నీకూ అయితే.

No comments: