Monday, 15 October 2012

ప్రతి విషయంలోనూ.. ఆత్మ ఉంటుంది నేస్తం!

నీళ్ళకి భయపడితే ఈత రాదు! నిద్రకి దూరం ఉంటే కలలు రావు! సిగ్గు, బిడియం ఉంటే కళకి అనర్హం! కత్తి, నెత్తురు గిట్టవంటే వైద్యం వద్దు! జనం వెంట ఎందుకంటే లీడరు కాలేవు! భావాల అవసరం ఎందుకంటే కవివి కావు! అర్థం చెప్పని తాత్పర్యం వ్యర్థం! అవగాహన లేని జ్ఞానం వృధా! లాభం లేనప్పుడు వ్యాపారం దండగ! సమాధుల మీద ఎగిరే విజయపతాకాలు ఎందుకు? ఆకలి తీర్చని విందు అశుద్ధ్హం! దాహం తీర్చని అమృతం కుళ్ళు జలం! చీకటి చీల్చని వెలుగు నిశి కన్న ఘోరం! వెన్నెల్లో ఎడారి నడక అతి దారుణం! మనసు పెట్టనప్పుడు ప్రతిపనీ యాంత్రికం! పని చెయ్యని యంత్రం ప్రాణంలేని శవం! చూడలేనప్పుడు కళ్ళున్నా కబోదులమే! జాలి తెలియని జన్మం మహా మృగం! కరుణ నిండని హృదయం కారడవి తో సమానం! అందుకే! మనిషికే కాదు ప్రతి చోటా, ప్రతి విషయంలోనూ.. ఆత్మ ఉంటుంది నేస్తం! మనం దాన్ని గుర్తించాలి! గౌరవించాలి!

No comments: