Monday, 15 October 2012

రాయలేని వారందరూ శిక్షార్హులు

ఒక కన్ను పోయిన రాజు తన ఆస్థాన కవులను, అతని కళ్ళను పొగుడుతూ పద్యం రాయమన్నాడుట. రాయలేని వారందరూ శిక్షార్హులు. అప్పుడు ఒక కవి ఈ చాటువు వ్రాసారు. "అన్నాతి గూడ హరుడవే అన్నాతిని గూడనప్పు డసుర గురుడవే అన్నా! తిరుమల రాయా! కన్నొక్కటి మిగిలె గాని కౌరవ పతివే !" " మీ శ్రీమతి పక్కనుంటే, ఆవిడ కళ్ళతో కలిపి ముక్కంటివి, లేకపోతె, ఒక్క కంటితో శుక్రాచార్యుడంతటి వాడివి, ఆ దిక్కుమాలిన ఒక్క కన్ను మిగిలింది కాని, లేకపోతె, ద్రుతరష్టుడంతటి వాడివి అయ్యేవడివి."

No comments: