Saturday, 13 October 2012

నేస్తం

నీ కన్నీటి ని చూసి నా గుండె నిండి పోయింది నువ్వు చిందించిన కన్నీరు నాకు భరోసానిచ్చింది నేస్తం... నీకు గుర్తుందా... ఆ రోజు నువ్వు నానిగాడి తో పంపిన ఆ ఉత్తరం... అందులో కన్నీటి చుక్కలతో అలుక్కుపోయిన అక్షరాలు చెప్పేసాయి మన స్నేహం గాఢతని ఆక్షణం నీ కన్నీరు నాకెంత ధైర్యాన్నిచ్చిందని? నాకోసం బాధపడే హ్రుదయం ఒకటంటూ ఉందని నా మనసెంత గర్వపడిందని? ఇంతకీ .. నా కనుల కాగితం పైన కన్నిటి చిత్రాలు నీకు కనిపిస్తున్నాయా మరి?

No comments: