Saturday, 13 October 2012

ఆవిరవుతున్న అనుబంధాలు

ఆవిరవుతున్న అనుబంధాలు కరుగుతున్న అనురాగపు సాకారాలు మనిషి మనగడకవి శేషప్రశ్నలు పేగుబంధానికర్థం నిఘంటువులో చిరిగినపుట ఆర్థికబంధంతో రక్తసంబంధం మసకబారినమాట మమతలను మసి చేసిన ద్రావకం స్వార్థపుతలపులతో మనసు మలినం బాంధవ్యాలే బరువని,బంధనాలు తెంచుకుని ఇదే స్వేచ్ఛా ఊపిరి అనుకుని నినదిస్తే అనుబంధాలు ఆమ్లధారలో ఆవిరవుతాయి మనసులోని కాలుష్యం ఉప్పెనలా వుధృతమై ఆనకట్టలేని కాలకూట విషప్రవాహమై ఊపిరాడనివ్వదు అగమ్య స్వేచ్ఛాకెరటం ఉప్పెన మిగిల్చిన కన్నీటి చారికలు మృగ్యమైన అనుబంధపు ఆనవాళ్లు బంధాలకు రహదారి మమతల వంతెన పరిమళించాలి అనుబంధ సుగంధాలు మానవతాప్రాకారాలకవి చెరగని పునాదులు

No comments: