Monday, 15 October 2012

ఎందుకూ పనికిరాని ఫీలింగ్ ఎడారిలో వానమబ్బే కదూ?

కూటికోసం కోటి విద్యలు! నిజమే!! ఒప్పుకుందాము! కానీ ఆ కోటి విద్యకూ శ్రమకు నిలయాలు ఐతే బావుంటుంది! అలా కాక నీచ, కీచక, యాచక చర్యలుగా మరితే ఎంత అసహ్యం? ట్రాఫిక్ లో సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ ఆగుతాయి! అందరికీ తెలుసు! కార్లను, టూవీలర్స్ ను, ఆటోలను చుట్టుముడతారు ముష్టివాళ్ళు! ఇది ప్రతిరోజూ, ప్రతిపూటా, ప్రతిగంటా,ప్రతి నిముషం జరిగేదే! కానీ ఈరోజెందుకో చూస్తుంటే భలే కోపంగా అనిపించింది! జాలి పుట్టిచడం కోసం అని ఎంత దారుణం చేస్తున్నరా అన్న బాధ! ఒకమగతను, దిట్టంగా, దీపస్థంభం లా బానే వున్నాడు! మనిషి కి వయసూ పెద్ద ఎక్కువేమీ కాదు! ఓ 35 ఉంటాయ్! అతను అడుక్కుంటున్నాడు! చేతిలో ఒక చిన్న నెలలపాపాయి! ఒంటిమీద చిన్న బట్ట కప్పలేదు కానీ కాలికి పెద్ద కట్టు కట్టాడు! ఆకలికో, నొప్పికో, ఎండనబడో పాపం చిన్నపాప ఏడుస్తోంది! ఆ ఏడుపును కాష్ చేసుకునే దందాలో వీడు! చెయ్యిజాపి ఏడుపు! పాలకి లేదయ్యా, మందుకి లేదయ్యా, చంటిది చస్తుందయ్యా!! అని రాగాలు పెడుతూ వసూలు చేసుకుంటున్నాడు! తన జన్మ వాడికి తప్ప తనకుపయోగపడదని అప్పుడే తెలుసుకునేసిందేమొ.. చంటిపాప గుక్కపట్టి ఏడుస్తూనేఉంది ఆపకుండా! వాడది పట్టించుకోవడమే లేదు! మనసుకి చాలా కష్టం వేసింది నేస్తం! కానీ ఏం చెయ్యగలం?? ఎందుకూ పనికిరాని ఫీలింగ్ ఎడారిలో వానమబ్బే కదూ?

No comments: