Tuesday, 16 October 2012

వర్షం .... ఓ చందమామ కధ

మబ్బులతో నిండిది ఆకాశం చిరుగాలితో చేసింది సావాసం చల్ల గాలికి వూగె చెట్ల కొమ్మలా? కొమ్మల వూగిసలాటకి వీచే గాలు లా? ఎండ ని కప్పేశానంటూ మబ్బు పారద నా వెలుగుని దాచలేవం టూ సూర్యుడి సరదా మిట్ట మధ్యాహ్నమా ? ఓ చల్లని సాయంత్రమా? ఏమో పొద్దు తెలియని ఓ సమయం వీచే గాలికి రేగిన మట్టి వాసన నేనొస్తున్నానంటూ తొలి చినుకు పైన పద పద మంటూ తొందర చేశాయి తోటి చినుకు నేస్తాలు ఒకటి రెండు పది వెయ్యి ... చినుకుల తో వాన మొదలు అల్లరి పిల్లల ఆటల టప టప మంటూ వడగళ్లు నేల మీద కాదు నింగి వైపు చూడమంటూ పలకరించే మెరుపులు మమ్మల్ని మరీచవేమో వెనకే ఉన్నామంటూ ఉరుములు వాన .......... అందమైన వాన!! పులకారించిన మనసులా .. జలదరించిన మేను లా ఒక అందం !! వాన .... ఒక అందం !! ఒక జ్ఞాపకం!!! జోరువానలో స్చూల్ బుస్ షెల్తెర్ లో ఇరికి వేడి వేడి గా తిన్న మొక్క జొన్న కంకి ! సెలవులలో వాన కురిసి అందరితో కలిసి తడిసి వణికే చలిగాలిలో వేడి నీటి స్నానం!! అమ్మ మందలింపు రాగాలకు హచ్చి హచ్చి తుమ్ముల తాళం ఇంటి ముందు నీటిలో కాగితం పడవలా వంకతో అప్పుడప్పుడు తడుస్తూ కేరింతలు కొట్టే బాల్యం "ఉరుములు మెరుపులు ఉ టా రూ తీగలు రమణీ గజ్జెలు కాళ్లకు రవ్వలు" నాన్న నేర్పిన బాల గీతం ఆ రోజులు గుర్తొచ్చి వయసు మరచి కాలేజీ లో కాగితాలు చింపినపుడు నవ్వుకుంటూ నన్నాపిన మిత్ర గనం ఆనాటి మధుర జ్ఞాపకం !! ఎన్ని మధుర క్షణా లో ఎన్ని తీపి జ్ఞాపకాలో వర్షం లో .... వర్షం తో ....... ఎన్ని మధుర క్షణా లో ఎన్ని తీపి జ్ఞాపకాలో వర్షం లో .... వర్షం తో ....... ఆ క్షణాలు నె మ రేస్తూ ఆ రోజులు తలుచుకుంటూ చేతిలో కాఫీ కప్పు తో అద్దాల మెడలో కార్పొరేట్ భవంతి లో గాలి వాటుకి చినుకులు ఆ అద్దాల మీద జాలువారే తళుకులు నీటి ముత్యాలు .. దీప కాంతులు వర్షం వెన్నెల కలగలిసిన అందాలు గడ్డ కట్టిన వెన్నెల పై ఎగిరి దూకే నక్షత్రాలు ఆరు బయట దీపాలపై కురిసి మెరిసే తుంపరలు ఆది అందమే ... ఆనందమే .... ఆది అందమే ... ఆనందమే .... కానీ.... కానీ .. అంతా కృత్రిమం ఆ వెలుగు వెన్నెల కాదు ఆ చినుకులు వాన కాదు అదో మరో లోకం మారుతున్న జీవనం రాత్రి లేదు పగలు లేదు ఆ రెంటికి తేడా లేదు పట్టపగలే చీకటి మిట్ట మధ్యాహ్నం చలిగాలి సాయంకాలం సూర్యోదయం పడమటి తో పోటీ పడే ఉషోదయం ఎండా వానలు లేవు ప్రకృతి మార్పుల అందాలు కాన రావు ఎటు చూసిన పచటి ఇండోర్ ప్లాంట్స్!! వాటికి శిశిరాలు లేవు వసంతాలు తెలియవు అదో వింత లోకం !!! అదో వింత లోకం !!! దాని బయట మరో ప్రపంచం మనిషి మనుగడ సవాల్ చేసే మరో మాయా జాలం నల్ల మబ్బు కమ్ముకుంది ఆది వానకారు మబ్బా? లేక కారు కాలుష్యపు మబ్బా? కురిసే వానలు నిజమేనా అవి కూడా కృత్రిమమా? లేక విషవాయువు నిండిన ఆసిడ్ వర్షాలా? ఏమో ఒక సంశయం .. ఒక భయం !! నా మనసులో ఆలోచనల లా రోడ్ల మీద నిండిన నీళ్ళు ఏ దిశగా సాగుతున్నామో ఎక్కడ ఆగిపోతామో ఏ సుడిలో పడతామో ఏనాటికి గమ్యం చేరతామో తెలియని అయోమయం పొంచివున్న ప్రమాదం అంతటా భయం భయం!! ఎన్ని చిక్కులో .. ఎన్ని సమస్యలో వర్షంతో ... వర్షంలో !! హమ్మ్ ........ నిన్నటి తీపి జ్ఞాపకం నేడు చిక్కుల మయం రేపటికి అవునేమో చరిత్ర పాటమ్ అవునా?? ఇంతేనా?? నేనేమి చేయలేనా? మారుతున్న కాలంతో జారుతున్న జీవితంతో ఇలాగే కొట్టుకు పోనా?? మొహానికి మాస్క్ లు వంటికి కావచాలు రేపటి తరానికి నా జ్ఞాపకాలు చందమామ కధలు!!!

No comments: