Tuesday, 16 October 2012

నచ్చిన నువ్వు

నచ్చిన నువ్వు చెప్పే తొలకరి చినుకుల్లాంటి ముద్దు మాటల్లో ముద్దగా తడిసిపొవాలని తోలి వేకువ జాము నుండి ఎదురు చూస్తుంటాను ఒంటరిగా కాదులే తోడుగా నీ తలపులు నువ్వు ఒక్కసారి వచ్చి వేల వసంతాలను కానుకిచ్చి వెళతావు అనుభూతుల వానలో తడిపి ఆరేలోపు వచ్చేస్తానంటావు నాకు మాత్రం మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్లతో రేయి కలలా సాగిపోతుంది నువ్వు తెచ్చే నవ్వుల కోసం చూసే ఎదురు చూపుల్లో మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది

No comments: