Saturday, 13 October 2012

చావు లెక్కలు

దోచుకునేవాడు దొడ్డి దారిలో వాని పని చేసుకుంటున్నాడు దాపరికం లేకుండా! చావు లెక్కలతో చావగొడుతుంటే నువ్వు పాపపుణ్యాల లెక్కలేస్తున్నావా నేస్తం వాడు పోతే కొందరేడ్చారని వీడు పోతే కొందరు చచ్చారని ఇక్కడ చావు లెక్కలూ..దొంగ లెక్కలే ఇంటోడికి ఏమీ కాదు . చంటోడిది చావులెక్కల సన్నాయి మేళం ! వీధి వీధి తిరిగి వాయిస్తున్నాడు , ఏ ఊరు వదలకుండా వాళ్ళకి మరక కూడా మంచిదే పబ్లిసిటీ పెరిగేందుకు వాళ్ళకి చావు కూడా మంచిదే రాజకీయంగా ఎదిగేందుకు వాళ్ళు ఓట్ల దొంగలే మనుషులను పంచుకుంటారు వాళ్ళు నోట్ల దొంగలే మనలను బికారీలను చేస్తారు వాళ్ళు, కరువు లెక్కలు దాస్తున్నారు వాళ్ళు, చావు లెక్కలు మోస్తున్నారు సమాధి మీద పూచిందో శ్వేతా మందారం తాజ్ మహల్ సింగారంలా చావు పాటల పైనే పూస్తుంది యువ రాజకీయం కీచక పర్వంలా ఎవడు ఎవడికి పుట్టాడో 'లాబు'లిచ్చిన వారసత్వపు లెక్క పత్రం రాజకీయానికి కొత్త రంగు తెస్తుందేమో! చావు లెక్కలు చెప్పుతూ చావు పాటలు పాడుతూ యువరాజులు రేపటి రాజకీయాన్ని మింగకముందే ' దొంగల అడ్దాని ' శుద్ధి చేద్దాం ' ఓటు 'తో

No comments: