Tuesday, 16 October 2012

నీ కంట కన్నీరు నే చూడలేను నేస్తం...

నింగి నేల ఏకం కావని తెలిసినా, ఒకటేనని చూపే నీ కన్నులు నాకిష్టం.. పసి పాపలా అమాయకంగా నవ్వే నీ నవ్వంటే నాకిష్టం.. మధురమైన మాటలు పలికే నీ మనసంటే నాకిష్టం.. ఆత్మీయత వొలకబోసే నీ పలకరింపంటే నాకిష్టం.. ఎడారైన నా జీవితానికి ఎండమావిలా దొరికిన స్నేహం నీది... కలలోనైనా నీ కంట కన్నీరు నే చూడలేను నేస్తం... నే కనుమరుగయ్యే క్షణం దాకా నీ కన్నులలో ఆనందం చూడాలనే నా తపన. నీ స్నేహం అనే వాకిలిలో నా మరణం కూడా ఓ మధురానుభూతే.. నీ సంతోషాలు పంచుకోవడానికే తప్పా నీ బాధలు పంచుకోవడానికి నే పనికి రానా ?

No comments: