Tuesday, 16 October 2012

తపస్సును చేసే తాపసిని కాను

తపస్సును చేసే తాపసిని కాను కావ్యాలు రాసే కిరాతకుడిని కాను బీజాక్షరాలు పొందిన కాళిచాసును కాను కానీ....ప్రతిక్షణం పదాలతో నీ పాదాల్ని కడుగుతాను అక్షర సుమాలతో నీకు అర్చన చేస్తా నన్ను కరుణించమని జ్ఞానాన్ని ప్రసాదించమని నా మస్తిస్కంలో ఎన్నో పొరలు ఎక్కద జ్ఞాన బీజాన్ని నాటావోనని అనుక్షణం అన్వేషిస్తూనే ఉంటాను నా చిన్ని ప్రపంచంలో 'బాసా తప్పితే 'భాష ' తెలీదు నాలో ఎంతో అలజడి అనంతమైన జ్ఞానంలో చిన్ని రేణువైనా కాలేనా అని వెతుకుతూ వెతుకుతూనే ఉంటాను ఎందరో పద సృస్టికర్తలు అందులో చిన్ని పదాన్నైనా కాలేనా అని చేతులు చాపి నిరంతరం కోరుతూనే ఉంతాను మణులూ, మాణిక్యాలు కాదు నీ నిఘంటువులో ఒక స్వరదీపికను ప్రసాదించమని నా భావుకతకు రూపమివ్వమని

No comments: