Wednesday, 6 June 2012

ఒక నల్లని పిల్ల

సముద్ర వనంలో పూచిన
కలువ కళ్ళ నల్లని చేప పిల్ల ఆ పిల్ల
గంపనెత్తుకునితిరుగుతోంది 
ఆకాశం దాచిన భూమి చుట్టూ

ఒక ప్రాచీన ఆకలినిఆగీ ఆగీ గుర్తుకు తెస్తో
---సాగిపోతోంది తనని
దాచుకున్న నీ చుట్టూ

------నిండైన ఒళ్ళు గలముద్దబంతిలాంటి ఆ పిల్ల-

బొడ్డులో దోచిన
ఎర్రటి పమిటా
కాలికి మెరిసే
ఆ వెండి పట్టా

-సిగలో పూలూ 
నడకలో
 వాలు-
వలేసి నీ
చూపుల్ని
పట్టుకుని

--వడి వడిగా
వెళ్లి పోతుంది
పచ్చిరొయ్యల

ఉప్పు నీటి వాసనతోకొరమేను తనువుతో
ఆ నీలి సముద్రపుఇసుక ఉంగరాల్లో

తటాలున దాక్కునే
చిన్ని పీతల
చిరునవ్వుతో

గంపెడెంత ఆశ
తీసుకు వచ్చిన
గమ్మతైన ఆ పిల్ల

నీలి నీలాల సీతాకోకచిలుకలు వాలిన
..మెత్తని కోరలున్నఆ పిల్ల
వెన్నెల పులిలాంటి ఆ పిల్ల

విధ్యుత్ఘాతం వంటి
తన నల్లని కళ్ళతో
నీ ప్రాణాల్ని గేలం వేసి

తనతో లాక్కు వెళ్ళే
తెల్లని కోరికైన
ఆ నల్లని పిల్ల-

సరే సరే
అది సరే కానీ
ఆకలిగా లేదూ

నీకు ఇంతకూ?

No comments: