Wednesday, 6 June 2012

భిక్ష

నీ కళ్ళని
తీసి అరచేతుల్లో ఉంచుకున్నావా

నీ కాళ్ళని
మేలుకొలిపి బయట అడుగుపెట్టావా

నీ హృదయాన్ని
శుభ్రంగా విదిల్చి
మరొక మరణానికై సంసిద్ధం చేసావా
నీ శరీరాన్ని
రాత్రి చద్ది మూట కట్టుకునిఈ లోకంలోకి సాగనంపావా

--తాళం వేయకు పెదాలకి
తెగుతాయని తెలిసినా
తెరిచే ఉంచు బాహువులని
చెమర్చిన
కన్నీళ్లను

తాగేందుకు ఉంచుకోదాచుకుని బొడ్డులో--ఒక మధుపాత్రని
------ఆ గుప్పిళ్ళలో
రహస్యంగా అట్టేపెట్టు
ఒక జీవన తేనె పిట్టని--

పద పద పద ప 
-యిక మనంఈ లోకంలోకిమనుషులని మనుషులకై
----అడుక్కునే వేళయ్యింది--

No comments: