క్రూర క్రీడా ప్రదర్శన
నీ వాక్య చాతుర్యం -
దానిని నేను
సమూహ సంబంధ
వ్యాపార వర్తకమనే
పిలిచాను
నువ్వొక ఆరితేరిన
కీర్తి కాంక్షకుడవనేగుర్తించాను. పాపం
ఏం తెలుసునిన్ను అల్లుకున్న
వెలిగిన పదాలకు
ఆత్మని గంధంవలెదేహానికి రాసుకున్న
ఆదిమ శబ్దాలకు
నువ్వొక, రూకల
జాతరవనీ
జాగ్రత్తవనీ?
భళి భళి భళి భళి
బావుంది బలేవిత్తనాలు లేనికవిత్వ ఫలం -
-సూపర్ మార్కెట్
శీతల గడులలో
అమర్చిన తాజా
పాల పద హారం-
అలా వొలిచి
ఇలా కట్టిన
మొక్కజొన్ను పొత్తుల
తగ్గింపు ధరల
వాచక సౌందర్యం-
పద పద పద యికతప్పుకో యిక
నీకెందుకు ఈ
నేలా నీరూ
నింగీ నిప్పూ?
ఒరే, ఒరొరే సమాధులలో
గోడకి వేలాడుతున్నాయి
నిరుటి నీ పుటల శవాలు
ఎవరో వచ్చి
నిన్ను తగలబెట్టేదాకానువ్వు ఇంతేనా?
నీ వాక్య చాతుర్యం -
దానిని నేను
సమూహ సంబంధ
వ్యాపార వర్తకమనే
పిలిచాను
నువ్వొక ఆరితేరిన
కీర్తి కాంక్షకుడవనేగుర్తించాను. పాపం
ఏం తెలుసునిన్ను అల్లుకున్న
వెలిగిన పదాలకు
ఆత్మని గంధంవలెదేహానికి రాసుకున్న
ఆదిమ శబ్దాలకు
నువ్వొక, రూకల
జాతరవనీ
జాగ్రత్తవనీ?
భళి భళి భళి భళి
బావుంది బలేవిత్తనాలు లేనికవిత్వ ఫలం -
-సూపర్ మార్కెట్
శీతల గడులలో
అమర్చిన తాజా
పాల పద హారం-
అలా వొలిచి
ఇలా కట్టిన
మొక్కజొన్ను పొత్తుల
తగ్గింపు ధరల
వాచక సౌందర్యం-
పద పద పద యికతప్పుకో యిక
నీకెందుకు ఈ
నేలా నీరూ
నింగీ నిప్పూ?
ఒరే, ఒరొరే సమాధులలో
గోడకి వేలాడుతున్నాయి
నిరుటి నీ పుటల శవాలు
ఎవరో వచ్చి
నిన్ను తగలబెట్టేదాకానువ్వు ఇంతేనా?
No comments:
Post a Comment