Thursday, 7 June 2012

మహా శబ్ధం

వీధి మలుపులో
తల వంచుకుని నిన్ను దాటుకుని వెళ్లిపోయారు ఎవరో
నిను తాకిన అతని కమిలిన శరీరపు గాలిని నువ్వు
_తిరిగి చూడనూ లేదు
వీడిన అతని అరచేతిని

_కొన వేళ్ళతో తాకనూ లేదు
వడలిన అతని ముఖాన్ని
_ఒక చిన్న మాటతో నువ్వు
నిమరనూ లేదు

ఏం చెప్పను తండ్రీ, యిక ఈ రాత్రి
గొంగళిపురుగు తిరుగాడే ఆకుపై
ఒక వాన చినుకుని రాయలేను-

కనురెప్పల పై వాలిన మెత్తటి నిద్రై
పూల దీవెనల దీపమై వెలగలేను

_ఇంతకూ ఈ నీ నా జీవితపు మహా శబ్దాన్ని
నిలువునా సంధించి, వలయమై చేధించి
____వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయిన వారెవరు?

No comments: