Wednesday, 27 June 2012

నా శాపశోకం

రెండు చుక్కల అత్తరు
రెండు చుక్కల కన్నీరు
రెండు చేతుల మధువు
నీ ఖాళీ పాత్రల కనుల నిండా తన రెండు తల్లి కౌగిళ్ళ
లాలించే పాలిండ్లు, పురా జోలపాటలు ఒడి ఊయళ్ళు-

తనువు రేగిపోయిన
నగర రహదారులని
రాత్రుళ్ళతో విసిరి వేసే గాలులలో

తన లేత ముఖాన్ని నీ ముఖంపై 
నిండుగా కప్పుకుని నును
వెచ్చగా
ముడుచుకుని పడుకోక పడుకునీనిదుర రాక, పోతే

ఒరే లిఖితుడా, నా ఆదిమ భిక్షుకుడామెరుపులు పగిలే వేళల్లో ఈ కాలాల్లో 
యిక ఇంతకు మించిన శాపం - శోకం

యింకా ఏదైనా మిగిలి ఉందా నీకు-?

No comments: