Sunday, 10 June 2012

వ్వె వ్వె వ్వే....


నన్ను పొగిడే వాళ్ళే నా కిష్టం
పొగిడినంత పెరుగుతా మరిన్ని పుస్తకాలు పొదుగుతా 


కవిత్వంలో నా దారిలో మరో పాదం లేదు
కథలలో నాకు ముందూ, నాకు తరువాతా మరొకరికి స్థానం లేదు


చాలు నాది ఇక ఒక్క కవిత, చాలు నాది ఇక ఒక్క కథ, కాదా ఇక కదలదా ఇక ఒక
హోరుహోరు ఈ ప్రపంచ కుగ్రామమంతా, మోగదా ఇక
అనుఏక అనువాదాల నానా వ్యాఖ్యల జోరు ముఖ తెరల నిండా?


నా పాటకులకు నేనే దేవుడను, వాళ్ళే నాకు నిరంతర దాస్యులను
నన్ను అను నిత్యం స్థుతించే బానిసలను, నన్ను చూసి పరవశించె భక్తులను


అహో నా అంత మహా రచయిత లేడు ఇక రాడు కాక రాడు


దళిత చిరుతను నేనే, అత్యాధునిక అంతరంగిక ఆ ఆవలివాడినీ నేనే
అక్కడ నేనే ఇక్కడ  నేనే, సర్వజనసమ్మోహన నిమ్నకులాల నీనీ
సకల జాతుల డిస్కోర్స్ న్దే, మార్క్ష్సిజమ్ న్దే, అంబేద్కర్ని కనుగొన్నదీ నేనే


ఫెమినిజం నాదే ఇస్లాం ముస్లిం తత్వం నాదే నిర్మాణం వినిర్మాణం
ఆధునికత అత్యాధునికాంతర సాంస్కృతిక యితరణం నేనే
భాష నాదే భావం నాదే, నలు దిక్కులా మెరిసిపోయే నామం నాదే
నానిలు నావే, నగ్న విప్లవ శ్రేణి నాదే, స్పష్టతా అస్పష్టతా నాదే అన్నింటా బోణీలు నావే 


ఇకనూ రచించెద, అన్ని పత్రికలందు వ్యాపించెద తంత్రీ తంత్ర ప్రసారములందు
వాద వివాదములను చర్చించెద, ఆనక కన్నూ మిన్నూ కానక
వరుసగా నా స్వీయ కవితా జైత్రయాత్రలను ముచ్చటగా మిక్కుట మర్కటముగా
ఆత్మకథలుగా పురజనులకు వినిపించెద, రాబోవు వారికి నా పౌరసత్వమును
సంపుట పుటలుగా, జ్ఞానముతో పీటముగా భూషణముగా వొదిలి వెళ్ళెద. దా దా 


అన్నింటా నేనే, సర్వాంతర్యామీ నేనే, అందరితోనూ నేనే అసలు అందరూ నేనే


అందుకే రండి. నన్ను స్థుతించుడి. నిండుగా నన్ను మురిపించుడి. నాపై మరిన్ని
పుస్తకాలని ప్రచురించుడి. అకాడమీలను అందించుడి
అందుకే రండి. నన్ను స్థుతించుడి. నన్ను ఇంకా ఇంకా ఇంకా నే మరణించు వరకూ
ఆదరించుడి. పొగడ్తలతో పూజించుడి. ఆకాశమును తాకునంత వరకూ
న చిరుబొజ్జను భజనకీర్తులతో నింపుడి, అందుకే రండి రారండి - అందుకే ఇక


ఎప్పతికైనను నన్ను పొగిడే వాళ్ళే నాకిష్టం
పొగిడినంత సాగఉతా, ఇంకా పొడుగ్గా పెరుగుతా ఇటువంటి ఆ పదాలని పొదుగుతా


అందుకే ఇక తాగుతా ఇటువంటి పదాలని. ఆహ్.. ఇహ అందుకే
ఇక అంతా, అంతకు మునుపూ ఆ తరువాత అనంతం దాకా నానా
పదాల స్ఖలనం, అవే నా అహంకీ నాకు బహుబలం


ఇంతకూ చూసావా నువ్వు, ఇంతకు మునుపు చూసావా నువ్వు
ఎవరి సమాధిలో నో, నా శరీరమంత నాలికను నాకుతున్న నీ నాలిక టిప్పా టప్పా నిను?   

No comments: