Thursday, 7 June 2012

నాకు తెలియదు

రాత్రిలో
నీ ముఖాన్ని వెలిగించుకుని, ఆ కాంతిలో విస్తుపోయాను-

కన్నా యిక ఇప్పటికీ నాకు తెలియదు
గుంపైన యూకలిప్టస్ చెట్ల కదలికలతోపూల బరువుతో పచ్చి నీటి వాసనతో సీతాకోకచిలుకల రెక్కలతో 

నా గదిలోకి, నా మంచంపైకి
ఆ నిండు వెన్నెల జాబిలి
ఎలా వచ్చి చేరిందో, అలా ఎలా

అంత హాయిగా నిదురోయిందో!

No comments: