Thursday, 7 June 2012

ఒకసారి

అరచేతుల్లో
ముఖాన్ని సమాధి చేసుకుని

చేతి వేళ్ళతో
తడిచిన రెప్పలని రుద్దుకుంటో

భూమంత
శ్వాసని తీసుకుంటావు నువ్వు

పలకలుగా
విరిగిన గుండెలోకి, కాలంలోకి-
హృదయంలో

వెలిగే ఆ తెల్లటి దీపపు
నల్లటి కాంతి అంచున
నీ నిద్రను ఉంచుతావు

ఒక శవాన్ని స్వప్నిస్తావు
స్మశానాలని పూలగా
తేనెపిట్టల తోటలుగా ఊహిస్తావు

ఒక నిస్సహాయతతోశరీరాన్ని మొత్తంగాఅరచేతులలో దోపుకుని

తిరిగి నీలోకి నువ్వే
రాలిపడతావుపిగిలిపోతావు

ఇంతకూ తెలుసునా నీకు? 

చచ్చిపోతాం మనం
... బహుశా ఇలాగే

శరీరమంత శూన్యంతోఆ ప్రేమంత పాపంతో
భరించలేని దిగులుతో- అని?

No comments: