Wednesday, 27 June 2012

నువ్వో, నేనో

ఎందుకో ఇష్టపడతావు నువ్వు -

నీడలు రాలిన మబ్బుల మధ్యాహ్నంగాలితో తిరుగుతో
ఈ మట్టిన రాలినపూలలో ఒకదాన్ని ఒడిసి పట్టుకుని

జాగ్రత్తగా దుమ్ము దులిపిఅరచేతిలో దాచుకుంటావు
నువ్వు:ఎవరికి తెలుసును

యిక రాత్రికి పూర్తిగా వడలిచినుకుల శోకంలోకి 
ఎందుకో ఇష్టపడి కూడా

రాలిపోయేదీ
పాలిపోయేదీ 
నువ్వో నేనో?

No comments: