Thursday, 7 June 2012

బొమ్మ

అలాగే తను వొచ్చింది-

ఉదయపు ఎండలో

గదిలో కదిలే పిచ్చుకలతో
చల్లని నీడలతో పరదాలతో

నన్నో బొమ్మగా మార్చి
సర్ది దిద్ది దుస్తులు వేసి
ఆడుకున్నంత సేపుఆడుకుని ఆనక ఆ

అరలో నన్ను విసిరేసి
ఎప్పటిలాగే, అలాగే
తను వెళ్లిపోయింది-

యిక చీకటయ్యే వేళకి
చిత్తడయ్యే వేళకి

గూటిలో ఒంటరిగా ఉన్న బొమ్మకి
భయం .... వేస్తే
దిగులు ... వేస్తే
బెంగగా .. ఉంటె
ఆ బొమ్మ

ఏం చేయాలి, ఎవరికి
ఏమని చెప్పుకోవాలి?

No comments: