Thursday, 7 June 2012

తను అడిగినది

తల్పమొక
నిన్ను చుట్టుకునే ఒక వంకీల త్రాచు అయిన నాడు
శరీరమొకనిన్ను తలచుకునే ఒక పచ్చి పుండు అయిన నాడు

పగలూ
రాత్రీ, నిన్ను వేటాడే క్రూర మృగాలు అయిన నాడు

అద్దంలో
నీ ముఖం ఒక పుర్రెలా ప్రతిబింబించిన నాడు

మనుషులు
కదిలే సమాధుల వలె నీకు తోచిన నాడు, ఆనాడు

నువ్వేం చేస్తావు? నువ్వెలా నిదురోతావు?

No comments: