నీ కన్ను తెగి నా కంటి అంచు నుంచి
రాలి పడుతుందొక నెత్తురు బొట్టు
తొలి వెలుతురు మసక గాజు పాత్రలోమంచు పొగ వలె
అతని కన్నీళ్ళలో
అల్లుకుంటుంది
ఆ నెత్తురు నిప్పు-
యిక అతను, యిక అతనికే
తొలిసారిగా మలిసారిగా
గుర్తుకు వస్తుంది అమ్మ, అన్నీ
అయ్యి ఏమీ కాక, అన్నీ అయ్యిఏమీ లేక ఏమీ కాలేక కాలపు బిలంలోకి ఇంకిపోయిన అమ్మ-
చెప్పు కన్నా
ఎలా అంతమౌతుందితల్లి లేని తను లేని
ఈ దిగులు దేహం?

No comments:
Post a Comment