Thursday, 7 June 2012

ఒక రోజు

యింకా నాతో ఉన్నందుకు
కృతజ్ఞతలుచూడు 

ధూపంలా మట్టిని రేపుతూ
చల్లగా భూమి ఉపరితలంపై

సాగిపోయింది చల్లని గాలి:
 చిన్నిచిన్న పరామర్శకే

లోపలి ఇసుక పొరల్లో
జలదరించి కదిలింది
ఒక సహజీవ నది-

 చిన్ని చిన్న తాకిడికే

నిండుగా ఒళ్లంతా విరుచుకుని
గలగలా ఆకులతో నవ్వింది
పిట్టలతో విరగబూసిన రావి మది

ఆ చిన్ని చిన్న వలయానికే

తన 
చుట్టూతా తానే తిరిగి
గీతల మబ్బైన ఆకాశానికి
ఎగిరింది ఒక కాగితం ధ్వని

 గాలితో పాటు గాలి కంటే
వేగంగా పరిగెడుతో పిల్లలు

జారే పోతున్నారు వాన చినుకులై
నీడలు పట్టిన రాదారులపై
హద్దు లేని /ఇకిలింతలై

వస్తునారు ఎవరో లోపలికి 
 దేహం గదిలోకి
తడిచిన వస్త్రాలను
విదుల్చుకుంటూ ఆరబెట్టుకుంటో

ఆ శి/ రోజాలను
తుడుచుకుంటో
సాంభ్రాణి సువాసనతో
చలిమంట మాటలతో-

యిక ఏమైనా కానీ
యిక ఏమైనా రానీ
యిక పర్వాలేదునిజంగా

ఎందుకంటే యిక  దినానికి 
ఈ ఫిరోజ్, ఆ శ్రీకాంత్
ఆ మధుశాలల్లో కాక
ఈ మధుపాత్రల్తో కాక

మనుషులలో
మనుషులతో
మత్తిల్లి స్వర్గలోకాలను చూసే వేళయ్యింది!

No comments: