Thursday, 7 June 2012

తేలికగా

తేలికైన రాత్రిలో
నా తేలికైన తనువుపై వాలిన తేలికైన సీతాకోకచిలుకవు నువ్వు
ఇలాగే ఉంటుందేమో

తేలికగా ఒక పుష్పం

తేలికైన నీ నిశ్శబ్దంలో 
తేలికైన ఆ గాలిలో
తేలికైన మంచులో

అలా హాయిగా, తేలికగా
నీలా వికసించినప్పుడు-

దిగులు చెందకు
బ్రతికి ఉండటమే
ఇవాళ మనం సాధించిన ఒక తేలికైన విజయం-

No comments: