Tuesday, 5 June 2012

నా సెలయేరు హృదయం

పరదాలు కదిలినపుడు 
నేనూ ఊగుతాను 

కిటికీలు మూసినపుడు
కిందికి జారిపడతాను

నువ్వు ఏదైనా విసురుతావని
రెండు కండ్లు కలిపి జోలె కడతాను

ఈ మాసిన లోకానికి
ఆ రహస్యం తెలియదు
ఓ ప్రియురాలా....!
ఈ రాత్రిని వెళ్ళనీయకు 

No comments: