Tuesday, 5 June 2012

నీ అమర స్మృతుల్లో


                    


అలా..అలా ..నీవు ..
వెన్నెల మెట్లెక్కుతూ ...
పున్నమి లోకాలకి ...వెళ్తూ ఉంటావు...
నీ జాడను చూపిస్తూ ...
విరగబూసిన ...విరుల సెలయేరు వెంట ...నేను ...
తూనీగనై నీ హృదయరామంలో ...చొరబడాలని..
విఫల యత్నం చేస్తూనే ఉంటాను ...


ప్రకృతి మొత్తం నీ పాదక్రాంతమై...
చంద్ర లోకాలకి స్వాగతం పలుకుతోంది ...


దిగులుగా ఆకాశం ...
గుబులుగా నేను ...
చీకట్లో చిరు దివ్వేవై ...ఆకసాన నీవు ...


మాటే రాని మౌనంగా నేను ...
పాట పాడుతూ ...పాల పుంతను చిలుకుతూ నీవు...


నీ దృక్కుల నుంచి నేల రాలుతున్న 
ఇంద్ర ధనస్సులు .....
పుష్ప శరాలు ఎక్కు పెడుతూ నేను ...
కనక తారలు రేరాజుని వదిలి నీ వెంట పడ్డాయి ...
దృశ్యమై నా ప్రేమ పుష్పమై ...గగనాన ....
పున్నాగ పూవునై ...
భువనాన నేను ...


భువినుండి దివికెగసిన ...నా నెచ్చెలి ...
నీ వొచ్చినా ....రాకున్న ....
నీ ఊహల ఉషస్సుల్ని...స్వప్నిస్తూ ...
జన్మ జన్మలని ...అలవోకగా జరిపేస్తా..

No comments: