Wednesday, 6 June 2012

సుఖం





సుఖం అంటె తెలియనీ నీకు..
నా ఎదుగుదలే,నా జీవితమే..
నీ ప్రాణం,నీ ప్రపంచంగా..
బ్రతికినావు నన్ను బ్రతికించావూ..

మనసు రోదిస్తుందీ నను పెంచిన..
... రోజులు గుర్తుకు చేసుకుంటే..
నీకు ఆకలైన వేళ నీవు నీళ్ళు తాగి..
నాకు అన్నం పెట్టిన క్షణలు..

ఆ క్షణలు నేను మరువలేను..
కానీ..గుర్తు ఉంచుకోనీ కొడుకుగా..
నీకు ఎమి చేయలేదు..

డబ్బు అనే మాయలో,మమతలను..
మరచి..బాద్యతలను వదిలేసాను..
నాకు తెలుసు కొడుకుగా అనర్హున్నీ అనీ..

అయిన నీ ప్రేమని పంచుతునే ఉన్నావు..
నీ ఆప్యాయతను చూపుతునే ఉన్నావు..
నీ చిరు నవ్వుతో స్వాగతిస్తూనే ఉన్నావు..
ఎదిగిన బిడ్డకు గోరు ముద్దలు తినిపిస్తూనే ఉన్నావు..

అందుకే "అమ్మ" మరో జన్మంటు ఉంటే..
నీకు "అమ్మ"నై పుట్టలనీ ఆశిస్తున్నాను..

No comments: