Wednesday, 6 June 2012

ఒక రోజు

నెలవంకల వంటి
ఎండ కనురెప్పల_________ కింద ఆ రోజంతా ఇలాగే గడిపాను

అదే గదిలో , నువ్వు
అలా నిస్త్రాణగా లేచి
వెళ్ళిపోయిన గదిలో
__________ వెళ్ళిన నీ నిట్టూర్పు
__________ వేడిగా వీచే నీ గదిలో

ఆ మంచంపై బోర్లా పడుకునిగాలి నీళ్ళల్లో చేతులూపుతూ
సాయంత్రం దాకా
పాల నేలపై రాలిన

నా రాతి ముఖాన్ని
---చూసుకుంటూ
మాట్లాడుకుంటూ
మళ్ళా నువ్వొచ్చి విసురుగా
పెరటి తలుపులు తెరచి
రాత్రిని లోపలి పిలిచేదాకా

ఒక్కడినే అనేకమందిని అయ్యి
నా ఒక్కడికే నాలో బందీ అయ్యి

-ఇకా రోజంతా అలాగే
నిమ్మళంగా గడిపాను-

--ఇంతకూ
వస్తూ వస్తూ--మనకు--
మన చీకటింట వంటింట్లో
పొయ్యి వెలిగించేందుకు
_____________ ఇన్ని బియ్యం
_____________ అన్ని కూరగాయలూ
_____________ తెచ్చావా

నీ దినవారీ నిందలతో పాటూ

నీ తనువంత ప్రేమ శాపలతో

నీ జీవితపు వేదనతో పాటూ?

No comments: