నా జీవితం లో ఉన్న
ఏకైక బంధం ,బందనం నువ్వే...
నిను విడలేకే
జీవిత ఖైదునయ్య..!!
నీ ఎద పాన్పు కన్నా..
మెత్తని పరుపు
వేరే ఎక్కడ దొరకలేదు నాకు.
ఎన్నో యుగాలైనట్టు ఉంది పవళించి..
ఒక్కసారి నీ ఎద చేర్చుకోవా....!!
నాకు ప్రేమ గురించి
అప్పుడప్పుడే తెలుస్తుంది.
నువ్వు నా పెదవులను తడిపినపుడో..
నీ గుండెలో గువ్వలా.. ఒదిగినపుడో..
ఒణికే నా చేతిని గట్టిగా..
నీ పిడికిలిలో.. బంధించినపుడో...
నాకెవరు లేరనుకునే క్షణాన..
"ఐ మిస్ యు" అని
నువ్వు మెసేజ్ పంపినపుడో..
సాయం సంధ్యలో నీతో గడిపినపుడో...
నాకు ప్రేమంటే ఏంటో.. తెలుస్తుంది.
నువ్వే ప్రేమని..!
నువ్వు నాతో ఉంటె ...
నేనే ప్రేమ అవుతానని...!!
No comments:
Post a Comment