Saturday, 29 December 2012

జీవితచక్రం!

వంటిపైన ఏవో రంగురంగుల చిత్రాలు టాటూలో....ఎవరైనా గీసారో చాలా అందంగా .. కాలం రంగులను పట్టుకెళుతోంది ఎవరో అదేపనిగా చిత్రాలను చింపేస్తున్నారు చిన్నగా శుషిప్తిలోకి ఊర్మిళను జోకొడుతూ మెళుకువ ఉన్నట్లే ఉంది కానీ గాఢనిద్ర‌ కళ్ళుతెరచుకొనే నిద్ర‌ ఆర్థనాధాలూ...విప్లవనినాదాలు నాకు తెలియకుండానే నడుస్తున్నా ఇన్సోమ్నియా కాదు. జాగృతి లోనే కోమా స్థితి సూర్యున్ని వెంటాడిన చంద్రుడు వెన్నెల జిమ్ముతూ సేదతీరాడు మళ్ళీ కోడి కూత‌ ఇప్పుడు సూర్యుడు వెంటపడుతున్నాడు ఒకటే పరుగులు ఒకటీ.....రెండూ....మూడూ..... లాబొరెటరీలల్లొ ప్రయోగాలు అస్థిత్వాలే కోల్పోతున్నారు క్షణ విరామెరుగని ఒక యంత్రం కాసేపు ఆగాలనుకుంది విశ్రమించాలనుకుంది. యంత్రాలు ఆగుతున్నాయి పుడుతూనే ఉన్నాయ్ సూర్యచంద్రుల‌ దోబుచులాటలు అగలేదు! ఏం జరిగినా సరే రెండు వాయువులు కళ్ళల్లోకి చెరుతున్నాయి రెటీనా లో రసాయినిక చర్య‌ కళ్ళ వెంబడి ......ఏవో నీళ్ళు హా.........అవి కన్నీళ్ళు!!!! ఒకోసారి పేర్లుమార్తాయి.... సి.వి. సురేష్....

No comments: