Saturday, 29 December 2012

వర్షించాలనే కోరిక పుట్టినట్టు

నా చెప్పుల్లో వాడి కాళ్ళు /ఎస్.వి.రామశాస్త్రి/ జీవితపు నీలి ఆకాశంలో బాల్యపు చిరుమేఘాలు రాగానే నాలుగు అడుగులు నేర్చుకునే సరికి నా చెప్పుల్లో వాడి కాళ్ళు చేరుతాయి నాన్న చెప్పేవాడు ఎవరి బాధనైనా తెలుసుకోవాలంటే వారి చెప్పుల్లోకి నీ కాళ్ళు చొప్పిస్తే తెలుసుకోవచ్చని వీడికి ఇదేమి కోరికో ఇప్పటి నుంచి బాధల్ని తెలుసుకోవాలనుకుంటాడో.. సరదాకి వేసుకోవాలనుకుంటాడో.. తెలియదు కాని నా చెప్పులు వేసుకోవడం అంటే వాడికి ఇష్టం సత్యమేమంటే.. బట్టలు వేసుకోని బాల్యంలో నిక్కర్లు ధరించాలని నిక్కర్లు తొడుక్కునే రోజుల్లో పేంట్లతో ఎప్పుడు ఊరేగుతామా అని చూస్తాం మీసాలు మొలవని రోజుల్లో గడ్డం ఎపుడు గీస్తామా అని తొందరపడ్తాం మీసాలు మొలచి రంగు వెలసిపోతున్నపుడు బాల్యపునది లోకి దూకి తనివితీరా స్నానమాడి దేహాన్ని చల్లబరుచుకోవాలని అనుకుంటాం ఇపుడు నా చెప్పుల్లోకి వాడి కాళ్ళు వెళ్తున్నప్పుడు బాల్యపుపాదరక్షల్లోకి నా కాళ్ళు వెళ్ళడం గమనిస్తున్నా ఎస్.వి.రామశాస్త్రి

No comments: