Saturday, 29 December 2012

నీవు లేని నాతో నేను తెలుపగలనా? ప్రియా ఇకనైనా... ?

ఓ నయనం వర్షించే నీ కోసం..ప్రియా ప్రియా నీ రూపు చెరిపేయమంది మరునయనం... ఓ పాదం కోరే నీవులేని లోకం వైపు పయనం.. నీ అడుగుల బాటలో సాగమంటుంది మరుపాదం... ఓ అదరం అడిగే నీతో మాటలసమరం..
మౌనశాంతిన్ని ఆకాంక్షించే మరు అదరం... మది ఆశించే నీ కౌగిలి భానిసత్వం.. విరహపు స్వేచ్ఛను కోరుతుంది నా హృదయం... గతం పంచుకోమంది నీతో జీవితం.. ఒంటరిగా జీవించమంటుంది వర్తమానం... ఇలా! నన్ను రెండుగా చీల్చే ఈ నరకయాతన.. నీవు లేని నాతో నేను తెలుపగలనా? ప్రియా ఇకనైనా... ?

No comments: