Saturday, 29 December 2012

పువ్వుల కన్నీరు

ఏ పూజకో నోచుకున్న హారం లోనో ఏ కానుకకో విరబూసిన పుష్ప గుచ్చం లోనో సుమ స్వరాక్షరాలుగా ఏ కొత్త కావ్య రచన చేయాలనుకున్నాయో ఏ మనోహర గానం ఆలపించాలనుకున్నాయో ! నల్లని నీడల అడుగుల కింద విరిగి పడుతున్న పువ్వు రేకుల శబ్దాన్ని వింటున్నావా! వాడి పోతున్న పువ్వుల రోదన చూస్తున్నావా! వరదలై పారుతున్న పువ్వుల కన్నీటిని స్ప్రుశించావా ! పరిమళించకుండానే నలిగి పోతున్న పువ్వుల ఆక్రందనలు పువ్వులై నవ్వకుండానే రాలి పోతున్న మొగ్గల ఆవేదనలు ఎలా ధ్వనిస్తున్నాయో చూడు ! కాంక్రీటు జంగల్లొ కరెన్సీ నోట్లకు అమ్ముడుపోయిన కాలాన్ని జనారణ్యంలో కాలుష్యమవుతున్న మానవీయ విలువలని మౌనంగా నిందిస్తున్నావా భారంగా భరిస్తున్నావా మానవ హారంలో మమకారం దారమైతే ఏ పువ్వు వాడిపోదు ఏ హారం తెగి పోదు ....Srinivas Reddy Paaruvella

1 comment:

Bharathadra said...

Brother meru dini nundi money sampadinchacu.adsense apply cheyandi.