Saturday, 29 December 2012

నీ కోసం నవ్వుతూ ఇక బ్రతికేస్తాను.

మన పరిచయమే ఒక పుస్తకమై, ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమై, అపురూపమైన నీ రూపాన్ని దాచి, రాసే ఈ అక్షరాలే మన సాక్ష్యాలు ఏడు అడుగుల దూరంలో, విధాత ఆటకి విడిపోయాము కాని, చివరికి మిగిలే మన ప్రేమలో, ఓడిపోయి కూడా మనం గెలిచాము
గతముతో నేను సతమతమవుతూ, ఒంటరిగా ఎన్నో క్షణాలు గడిపాను. ఆపుకోలేని అశ్రువులతో తడిచి, ఈ యెదలో నా వ్యధ దాచాను. దేవుడినే ద్వేషించాలి, తలరాతనే దూషించాలి. నమ్మలేని నిజాన్ని మరిచి, నీ కలలో ఇక జీవించాలి. నా మౌనంలో నీ సంతోషం ఉందని, ఈ హృదయానికి సర్దిచెబుతాను. నవ్వే నివ్వెర పోయేలా, నీ కోసం నవ్వుతూ ఇక బ్రతికేస్తాను. లక్ష్మి శ్రీనివాస్

No comments: