Saturday, 29 December 2012

కళ్ళులేవు

ఒళ్లంతా ముళ్లు ఊహల్నిండా జెర్రులు నిలువెల్లా కీటకాలు తనువెల్లా కందిరీగలు మనుషులు నడిచే విషపు పురుగులు నాజూకైన పడగలతో నతికి ఉన్న సర్పాలు నవనవలాడే స్టైళ్లతో పొంచి ఉన్న మృగాలు ఊరుఊరంతా న భయం న లజ్జా ఇప్పుడు ఏ చోటైనా కామాంధులకు కళ్లు లేవు అసలు ఈ దేశంలో న్యాయదేవతే గుడ్డిగా బతుకీడుస్తోంది. అమ్మా! జర పదునెక్కు అక్కా! కారప్పొడి మర్చిపోకు చెల్లీ! నువ్వు పెన్సిల్ చెక్కు చిట్టి తల్లీ! నువ్వు పండ్లు పటపట కొరుకు

No comments: