Saturday, 29 December 2012

నాలోని నీతో ఒక మాట

పూవుల లాలిత్యానికి మురిసి పోతాను అంతమాత్రాన మనసులో మాలిన్యాన్ని ఊహించకు ఫలము లోని మధురత్వానికి లొంగి పోతాను అంతమత్రాన హృదయములో దౌర్భల్యాన్ని ఊహించకు సృష్టి కారుడు గీసిన చిత్రానికి నిశ్చేష్టుడు నైతాను అంతమాత్రాన దృష్టి లోపముందనుకోకు నిశబ్దములో భరించలేని శభ్దాన్ని వింటూ మౌనంగా వుంటాను అంతమాత్రాన మూగ వాడిని అనుకోకు చేప కన్నులు చెరువులో ఈదినప్పుడు,నాకన్నులు కాలువలైతాయి అంత మాత్రాన బలహీన మైన గుండె కాదు కడుపులో ఖడ్గాలు దాయడం చేత గాదు అంతమాత్రాన యుద్ధ విముఖున్ని గాదు నీవు నన్ను శిలువ వేయడానికి సహకరించాను అంత మాత్రాన నీవు గెలిచినట్టుగాదు ...మూర్తిరాజు అడ్లూరి

No comments: