Tuesday, 20 March 2012


పట్టుదలతో చేసే సమరంలో తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా..
ఈ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనుకడుగు వేయక 
ఏ అడుగు తడబడనీయక 
నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా 
ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే 
కష్టం అంటే దూది కూడా భారమే
లక్ష్యమంటూ లేని జన్మే దండగా
లక్ష్యలాది మంది లేరా మందగా
పంతం పట్టి పోరాడందే 
కోరిన వరాలు పొందలేరు కదా
చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే 
చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే 
ఒక్క అడుగు వేసి చూస్తే చాలు
ఎక్కలేని కొండ ఏదీ లేదురా
నిన్ను చూసి నవ్వే వాళ్ళు తలదించుకునేలా 
దిక్కులు జయించి సాగిపో ముందుకు
పట్టుదలతో చేసే సమరంలో తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా......!!

No comments: