Saturday, 24 March 2012

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా
మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
యతి రాజుకి జతి స్వరముల పరిమళమివ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
యెదిరించిన సుడి గాలిని జయించి నావా
మదికొరిన మధుసీమలు వరించి రావా
పడమర పడగలపై మెరిసే తారలకై
ధాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హ్రుదయ రవళి ఓంకారం కానీ
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా
మ్రుదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడ
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కుల
ఆనందపు గాలి వాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
లలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హౄదయంలో వికశిత శత దళ శోభల సువర్ణ కమలం

No comments: