Saturday, 24 March 2012

MY DREAM GIRL

అతిలోక సౌందర్యమా ..!
కలువలు సైతం కుళ్ళు కుంటూ వున్నాయి

నీ కన్నుల సొగసును చూసి ...


గులాబీ లు సైతం సలాం అంటున్నాయి


నీ పెదవుల ఎర్ర దనాన్ని చూసి ...


పాలమీగడలు సైతం దాసోహం అంటున్నాయి


నీ చెక్కిళ్ళ చక్కదనాన్ని చూసి...


పండువెన్నెల సైతం పరవసిస్తుంది


నీ చిరు మందహాసాన్ని చూసి...


తేనే మాధుర్యం తక్కువనిపిస్తుంది


నీ పలుకులలో తియ్యదనం చూసి ...


చందమామ కూడా చిన్నబోయింది


నీ మోము ని పరిశీలనగా చూసి ...


సరిగమల కి కూడా గతి తప్పుతుంది


నీ నడకలోని హొయాలను చూసి ...


ఇంద్రధనస్సు కూడా మైమరచిపాయింది


నీ మేని విరుపులు చూసి ...


అను నిత్యం నను కలలో వేధించే అతిలోక సౌందర్యమా


ఇంతకీ నీవెక్కడ ....???

No comments: