Wednesday, 21 March 2012

తూర్పు ఆకాశం కిటికీలోంచి కొత్తగా ఉంది

వేకువ జామున
తూర్పు ఆకాశం కిటికీలోంచి

కొత్తగా ఉంది,



చూస్తూనే ఉన్నాను!



పక్షులెగురుతుండగా

మసక చీకటి చివరన

సూర్యోదయం..

రెండు కళ్ళు చాలవేమో

ఆ అందాన్ని

ఆస్వాదించడానికి.



అలికిడయితే పక్కకు చూసా

అక్కడ నవ్వుతూ నువ్వు

నీ చిరునవ్వుల్లో పువ్వులు,

నాకెన్ని కళ్ళు కావాలో 

నీ అందాన్ని 

ఆస్వాదించడానికి..



ఒక్కసారిగా అయోమయం

అటు తూర్పును చూడాలా

ఇటు నిన్ను చూడాలా??



తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాను

ఆ ఆకాశంలో 

ఉదయిస్తున్న సూర్యుడి పక్కన

నవ్వుతూ.. నన్నే చూస్తూ ...

నువ్వే!!!

No comments: